టాలీవుడ్ లో మరో ప్రేమ జంట.. హీరోయిన్ ను పెళ్లాడబోతున్న రామ్ పోతినేని?

  • రామ్, అనుపమ పరమేశ్వరన్ ప్రేమలో ఉన్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం
  • కొంత కాలంగా రిలేషన్ లో ఉన్నారని ఫిలింనగర్ టాక్
  • 'ఉన్నది ఒకటే జిందగీ', 'హలో గురూ ప్రేమ కోసమే' చిత్రాల్లో కలిసి నటించిన జంట
సినీ రంగంలో ప్రేమ వివాహాలు సాధారణమే. హీరో, హీరోయిన్లు ప్రేమలో పడటం, పెళ్లి చేసుకోవడం వెరీ కామన్, టాలీవుడ్ లో సైతం ఎంతో మంది ప్రేమ వివాహాలు చేసుకున్నారు. త్వరలోనే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీలు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. తాజాగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రామ్ పోతినేని వంతు వచ్చింది. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, రామ్ ఇద్దరూ ప్రేమలో ఉన్నారని ఫిలింనగర్ లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. 

కొంత కాలంగా వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని, ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకునే యోచనలో ఉన్నారని సమాచారం. ఈ వార్త సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది. అయితే ఈ వార్తలపై వీరిద్దరిలో ఎవరూ కూడా ఇంకా స్పందించలేదు. రామ్, అనుపమలు 'ఉన్నది ఒకటే జిందగీ', 'హలో గురూ ప్రేమ కోసమే' చిత్రాలలో కలిసి నటించారు. అప్పుడే వీరి మధ్య ప్రేమ మొలకెత్తిందని అంటున్నారు.

Ram Pothineni
Anupama Parameswaran
Love
Marriage
Tollywood

More Telugu News